బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

కేంద్రం దేశ వ్యాప్తంగా భారీగా బ్యాంకుల విలీనానికి తెర తీయడాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్‌ ఉద్యోగులు ఈ నెల 26, 27వ తేదీల్లో చేపట్ట తలపెట్టిన రెండు రోజుల సమ్మె నిరవధికంగా వాయిదా పడింది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శితో సమావేశమైన తరువాత.. తమ సమ్మె ప్రతిపాదనను వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. బ్యాంకుల విలీనం నేపథ్యంలో తాము ఆవేదన చెందుతున్న అంశాలపై విశ్లేషణ జరిపేందుకు ఒక కమిటీని వేసేందుకు సర్కారు అంగీకరించిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ప్రతిపాదిత రెండు రోజుల సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టుగా వారు వెల్లడిలంచారు. బ్యాంకుల విలీనం నేపథ్యంలో తాము ఆవేదన చెందుతున్న అంశాలపై విశ్లేషణ జరిపేందుకు ఒక కమిటీని వేసేందుకు సర్కారు అంగీకరించిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము ప్రతిపాదిత రెండు రోజుల సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టుగా వారు వెల్లడిలంచారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పది బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని కేంద్రంలోని మోడీ సర్కారు ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఆగ్రహించిన ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐబీవోఏ), ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్‌నస కాన్ఫెడరేషన్‌ (ఏఐబీవోసీ), నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ (ఎన్‌వోబీఓ), ఇండియన్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫీ సర్స్‌ కాంగ్రెస్‌లు (ఐఎన్‌బీవోసీ) ఈ నెల 26, 27న రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్లనున్నట్టుగా ప్రకటించాయి. విలీనాన్ని వ్యతిరేకించడంతో పాటు ఉద్యోగుల వేతనాలను సవరించాలని, పెన్షన్లను పెంచాలని బ్యాంక్‌ యూనియన్లు సర్కారు ను డిమాండ్‌ చేస్తున్నాయి. బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా పడడంతో సగటు వేతన జీవులు కొంత ఊరట చెందారు. పండుగల సీజన్‌లో బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మె బాటపడితే జీతాలు ఆలస్యమవుతాయోమనని ఉద్యోగులు గత కొన్ని రోజు లుగా చింతిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సమ్మె వాయిదాతో ఒక జీతాలు, పెన్షన్లు, బోనస్‌లు సకాలంలో అందగలవని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.